శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (10:24 IST)

కన్నుల పండువగా హనుమాన్ శోభాయాత్ర

హైదరాబాద్ నగరానికి హనుమాన్ జయంతి కొత్త శోభ వచ్చింది. వీర హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. వేలల్లో తరలివచ్చిన భక్తులతో నగర వీధులు కిక్కిరిశాయి. దారి పొడవునా జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో భక్తులు

హైదరాబాద్ నగరానికి హనుమాన్ జయంతి కొత్త శోభ వచ్చింది. వీర హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. వేలల్లో  తరలివచ్చిన భక్తులతో నగర వీధులు కిక్కిరిశాయి. దారి పొడవునా జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో భక్తులు హోరెత్తించారు. గౌలిగూడ రామమందిరంలో ప్రత్యేక పూజల తర్వాత వీర హనుమాన్ శోభయాత్ర ప్రారంభమైంది.
 
ఈ యాత్ర సందర్భంగా పోలీసులు సిటీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. గౌలీగూడ నుంచి తాడ్ బంద్ హనుమాన్ దేవాలయానికి వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  అయినా కొన్ని చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. యాత్ర ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
 
మరోవైపు, శోభాయాత్రలో పాల్గొన్న భజరంగ్ దళ్ జాతీయ ఉపాధ్యక్షుడు సోహంజి సోలంకి సంచలన కామెంట్స్ చేశారు. కుహనా సెక్యులరిస్టులతో దేశం ముక్కలైంది. హిందూ వ్యతిరేకులను ఏరివేస్తామన్నారు. ఆయోధ్యలో రామమందిరం నిర్మించి తీరుతామని చెప్పారు. బెంగాల్, కేరళ, కాశ్మీర్‌లో హిందూవాదులపై అణిచివేత జరుగుతోందన్నారు.