శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 18 మార్చి 2018 (10:10 IST)

కేసీఆర్‌కు ఉన్నదేంటి.. బాబుకు లేనిదేంటి? జగన్ ఉగాది శుభకాంక్షలు

తెలుగు ప్రజలకు శ్రీవిళంబి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ విళంబి నామ సంవత్సరంలో ప

తెలుగు ప్రజలకు శ్రీవిళంబి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ విళంబి నామ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి ఇంటింటా సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని జగన్ కోరుకున్నారు. 
 
ఈ తెలుగు సంవత్సరంలో సకాలంలో వర్షాలు కురవాలని.. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా వుండాలని.. పాడిపంటలతో రైతులు వర్ధిల్లాలని జగన్ ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాది తెలుగు వారి జీవితాల్లో ఎనలేని ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని వైఎస్ జగన్ అభిలషించారు.
 
మరోవైపు గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన రైతు ఆత్మీయ సదస్సులో పాల్గొని ప్రసంగించిన జగన్.. ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. గడిచిన నాలుగేళ్లలో తెలంగాణ సర్కారు ఎంతో బీడు భూమిని సాగుభూమిగా మార్చిందని కొనియాడారు. అయితే చంద్రబాబు మాత్రం తన స్వార్థప్రయోజనాలే తప్ప రైతుల గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరని జగన్ విమర్శించారు.
 
తెలంగాణలో లిఫ్టులు పెట్టి మరీ కేసీఆర్ నీళ్లు తోడిస్తున్నారని.. చంద్రబాబు మాత్రం తన స్వార్థప్రయోజనాలే తప్ప రైతుల గురించి ఆలోచించే పరిస్థితిల్లో లేరని జగన్ విమర్శించారు. ఏపీలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిపోయిందని, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉన్నదేంటి? సీఎం చంద్రబాబుకు లేనిదేంటి? అంటూ ప్రశ్నించారు. 
 
తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 12,500 పెట్టుబడిని అందిస్తామని, ఉచితంగా పొలాల్లో బోర్లను వేయిస్తామని తెలిపారు. ధరల స్థిరీకరణ కోసం రూ.3వేల కోట్లతో నిధిని కేటాయిస్తామని, పగటిపూటే 9 గంటల కరెంటును ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు.