సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (14:04 IST)

గుండమ్మ కథలో సావిత్రిగా శ్రీముఖి

టాప్ యాంకర్లలో ఒకరైన శ్రీముఖికి యూత్ మధ్య వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యాంకర్‌గానే కాకుండా నటీమణిగానూ నిరూపించుకున్న శ్రీముఖి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న ''రంగ‌స

టాప్ యాంకర్లలో ఒకరైన శ్రీముఖికి యూత్ మధ్య వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యాంకర్‌గానే కాకుండా నటీమణిగానూ నిరూపించుకున్న శ్రీముఖి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న ''రంగ‌స్థ‌లం'' సినిమాలోని రంగ‌మ్మ మంగమ్మ పాట‌ను తన హావభావాలతో కలిపి ఓ వీడియోని త‌న ట్వీట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త వైర‌లైంది. 
 
తాజాగా ''మహానటి'' సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సావిత్రిగా తయారై ఫోటో షూట్స్ తీయించుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. పటాస్ షోలో భాగంగా ఓ స్పూప్‌ కోసం ఈ గెటప్పులో కనిపిస్తానని ట్వీట్ చేసింది. 
 
''గుండమ్మ కథలో సావిత్రి'' అంటూ టాగ్ తగిలించి ఈ ఫోటోల్ని తన ట్విట్టర్లో శ్రీముఖి పోస్ట్ చేసుకుంది. ఈ ఫోటో చూసిన కొంద‌రు నెటిజన్లు ''మ‌హాన‌టి'' సినిమాలో కీర్తి సురేష్ క‌న్నా శ్రీముఖి అయితే చాలా బాగుండేద‌ని అభిప్రాయ‌ం వ్యక్తం చేస్తున్నారు.