సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 11 జులై 2019 (12:14 IST)

తల్లిదండ్రులతో గొడవపడి బయటికి వచ్చేసింది.. ఆ బాలికపై ఐదుగురు, 5రోజులు..

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఐదుగురి దుండగులతో కూడిన ఓ బృందం.. 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, తమిళనాడులో కొన్ని నెలల పాటు చిన్నారులపై, మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా చెన్నై, పురసైవాక్కం ప్రాంతంలో 16ఏళ్ల బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. పుళియంతోపుకు చెందిన 16 ఏళ్ల బాలిక.. తల్లిదండ్రులతో గొడవపడి ఇంటిని వదిలి బయటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో జూలై మూడో తేదీ ఇంటి నుంచి బయటపడిన ఆ బాలికను ఓ మహిళ ఉద్యోగం ఇప్పిస్తామనని తీసుకెళ్లింది. ఇలా ఆ బాలికను పురసైవాక్కంలోని నిషా అనే ఓ మహిళ ఇంట్లో నిర్భంధించారు. ఆపై ఐదుగురు దుండగులు బాలికపై ఐదు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
లైంగికంగా చిత్ర హింసలకు గురిచేశారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆ బాలిక తల్లిదండ్రుల వద్దకు చేరుకుని జరిగిన అఘాయిత్యాన్ని చెప్పుకొచ్చింది. దీంతో షాకైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సబీనా, నిషా, ముబీనా అనే ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరివద్ద విచారణ జరిపిన పోలీసులు 16ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన కామాంధులను అరెస్ట్ చేశారు.