శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 మే 2021 (18:41 IST)

ప్రేమ పేరుతో గర్భం చేశాడు.. పెళ్లి మాటెత్తేసరికి ముఖం చాటేశాడు..

మహిళలపై నేరాల సంఖ్య పెరిగిపోతుంది. మహిళలను మోసం చేసే వారు కూడా పెరుగుతున్నారు. తాజాగా ప్రేమ పేరుతో మైనర్ బాలికను గర్భవతిని చేశాడో యువకుడు.. ఈ ఘటన కృష్ణా జిల్లా కైకలూరు మండలం కాళ్లపాలెం పంచాయితీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కాళ్లపాలెం శివారు చింతలమూరుకు చెందిన దళిత మైనర్ బాలిక (17) ను సానారుద్రవరానికి చెందిన గుంతల జగదీశ్ (22) అనే యువకుడు ప్రేమ పేరుతో మైనర్ బాలికను లోబరుచుకున్నాడు. బాలికపై అనేక సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
 
దీంతో బాలిక గర్భం దాల్చింది.. ఇదే సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని బాలిక అడగడంతో ముఖం చాటేశాడు జగదీశ్. దీంతో బాలిక తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలిపింది. తల్లిదండ్రులు కలిదిండి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
 
నిందితుడిపై అత్యాచారం, పోక్సో, ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం కైకలూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపామని, డీఎస్పీ సత్యానందం కేసు దర్యాప్తు చేస్తారని పేర్కొన్నారు.