జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12.55 నుంచి ఒంటి గంట మధ్య మంచి ముహూర్తం ఉందని పండితులు చెప్పడంతో ఆయన దీనికే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. అయితే, ఎండ వేడిమిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని రాజ్‌భవన్‌లో పెట్టుకోవాలన్న ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం కార్యక్రమంపై ఒకటి రెండు రోజుల్లో ఒక స్పష్టత రానుంది.