మిస్ అమరావతి ఎవరో తెలుసా... ప్రవల్లిక.. కుసుమకుమారి, ప్రత్యూషలు రన్నరప్‌గా?
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో మిస్ అమరావతి పోటీలు అలరించాయి. మిస్ అమరావతి అందగత్తె పోటీలు అదరహో అనేలా సాగాయి. ఈ పోటీలో విజయవాడకు చెందిన ప్రవల్లిక మిస్ అమరావతిగా ఎంపికైంది. గుంటూరుకు చెందిన కుసుమకు
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో మిస్ అమరావతి పోటీలు అలరించాయి. మిస్ అమరావతి అందగత్తె పోటీలు అదరహో అనేలా సాగాయి. ఈ పోటీలో విజయవాడకు చెందిన ప్రవల్లిక మిస్ అమరావతిగా ఎంపికైంది.
గుంటూరుకు చెందిన కుసుమకుమారి, ప్రత్యూష రన్నరప్‌గా నిలిచారు. యువతులు ర్యాంప్‌పై హొయలు ఒలికించారు. ప్యూచరాల్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం నగరంలోని మెట్రోపాలిటన్ హోటల్లో జరిగింది.
తెలుగు చీరకట్టులో అందాలు ఒలకబోస్తూ.. మాడ్రన్ డ్రస్సుల్లో పోటీ పడ్డారు బెజవాడ భామలు. సాయి క్రియేటివ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్‌ను నిర్వహించింది. మెట్రోపాలిటన్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం హుషారెక్కించింది.