శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2019 (08:41 IST)

శ్రీవారి హుండీలో 5 కిలోల బంగారు వజ్రం కానుక

తిరుమల శ్రీవారికి నిత్యం కోట్ల విలువచేసే కానుకలు వచ్చే సంగతి తెలిసిందే. హుండీలో నగదుతో పాటు బంగారు నగలు, వజ్రాలు సైతం సమర్పిస్తారు. ఈరోజు ఓ అజ్ఞాత భక్తుడు ఐదు కిలోల బంగారు వజ్రాల కిరీటాన్ని సమర్పించారని దేవస్థానం అధికారులు తెలిపారు.
 
శ్రీవారి ప్రత్యేక దర్శనాల్లో నేడు, రేపు అదనపు కోటా
ప్రతినెలా వృద్ధులకు, దివ్యాంగులకు, చంటిబిడ్డ తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనాల్లో కల్పించే అదనపు కోటాను ఈనెల 15, 16 తేదీల్లో ఏర్పాటు చేశారు. మంగళవారం వృద్ధులు, దివ్యాంగులకు 4 వేల టోకెన్లు జారీచేయనున్నారు.

వీటిని ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్‌లో ఉదయం 7 గంటల నుంచి మంజూరు చేస్తారు. అలాగే బుధవారం 5ఏళ్ల లోపు చంటిబిడ్డల తల్లిదండ్రులను ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సుపథం ప్రవేశమార్గంలో అనుమతిస్తారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.