మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 9 ఏప్రియల్ 2018 (21:54 IST)

పోలవరం ప్రాజెక్ట్ పనులు 52 శాతం పూర్తి... మంత్రి దేవినేని

అమరావతి : రాష్ట్రానికి అత్యంత ప్రధానమైన బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఇప్పటివరకు 52 శాతం పనులు పూర్తయ్యాయని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్, ఇతర 53

అమరావతి : రాష్ట్రానికి అత్యంత ప్రధానమైన బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఇప్పటివరకు 52 శాతం పనులు పూర్తయ్యాయని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్, ఇతర 53 ప్రాజెక్టులు, నీరు-చెట్టు, నీరు-ప్రగతి పనులపై 56వ వర్చువల్ సమీక్ష నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ పనులు 89 శాతం, ఎడమ ప్రధాన కాలువ పనులు 58 శాతం, హెడ్ వర్క్ పనులు 34 శాతం పూర్తి అయినట్లు వివరించారు. 
 
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందు పోలవరం నిర్మాణానికి రూ.5,135.87 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరవాత రూ.8,229.11 కోట్లు, 2018 ఫిబ్రవరి వరకు మొత్తం రూ.13,364.98 కోట్లు వ్యయం చేసినట్లు మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.5,342 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు తెలిపారు. ఇంకా రూ.2,886.85 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు పది రోజుల కిందట చెప్పారని, నేటి వరకూ అందజేయలేదని మంత్రి తెలిపారు. వర్షాలు వచ్చేలోగా గోదావరి నదిలో పనులు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
 
మూడో వారంలో పోలవరం పనులను సీఎం పరిశీలన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందు చూపుతో ఏపీలో ఏడు ముంపు మండలాలను కలిపితేనే సీఎంగా ప్రమాణాస్వీకారం చేస్తానని చెప్పిన విషయాన్ని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గుర్తు చేశారు. ఈనాడు అక్కడి రైతులు 60 బస్తాల వరకు పంట పండిస్తున్నారని చెప్పారు. పది లక్షల ఎకరాలకు నీరందించినట్లు తెలిపారు. చివరి భూములకు కూడా నీరందించామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రాజెక్టుల వారీగా పనులు వేగవంతం చేసినట్లు తెలిపారు. ఈ నెల మూడవ వారంలో ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టుని సందర్శిస్తారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.