శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Updated : బుధవారం, 15 ఆగస్టు 2018 (12:49 IST)

పెళ్లైన ప్రియుడితో కలిసి తెనాలికి యువతి... గది అద్దెకు తీసుకుని...

గుంటూరు జిల్లా తెనాలిలో ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేకెత్తించింది. ఏలూరుకు చెందిన సాయిదివ్య, విజయవాడకు చెందిన పృధ్వీరాజ్ పట్టణంలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నెల 1

గుంటూరు జిల్లా తెనాలిలో ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేకెత్తించింది. ఏలూరుకు చెందిన సాయిదివ్య, విజయవాడకు చెందిన పృధ్వీరాజ్ పట్టణంలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నెల 12వ తేదీ తెనాలి వచ్చిన వీరు గాంధీచౌక్ లోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. 
 
రాత్రి 10 గంటల సమయంలో రూమ్ తీసుకున్న వీళ్లు 14వ తేదీ వరకూ బయటకు రాకపోగా గది నుండి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు విచారణ చేయగా మృతులు ఏలూరుకు చెందిన k.సాయిదివ్య, విజయవాడకు చెందిన దారా పృధ్వీరాజ్‌గా నిర్ధారించారు.
 
మృతుడికి అంతకుముందే వివాహం కాగా మృతురాలు చదువుకుంటోందని తెలుస్తోంది. వీరి మధ్య ప్రేమ వ్యవహారంతోనే ఇరువురు ఇంటి నుండి పారిపోయి వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.