బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : ఆదివారం, 11 ఆగస్టు 2019 (23:20 IST)

విజయవాడలో భార్య తల నరికి.. చేతిలో పట్టుకుని నడిరోడ్డుపై..

విజయవాడలో దారుణం జరిగింది. సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపడమే కాదు, స్థానికులు భయభ్రాంతులకు గురిచేసింది. ఓ వ్యక్తి అతి కిరాతకంగా భార్యను హత్యచేసి, మొండెం నుంచి తలను వేరుచేశాడు. 
 
ఆ తలను పట్టుకుని నడి రోడ్డుపై నడుచుకుంటూ రావడం చూసిన స్థానికులు భయపడిపారిపోయారు. వివరాల్లోకి వెళితే విజయవాడకు చెందిన ప్రదీప్‌కు క్రాంతి అనే యువతితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. అయితే పెళ్లైన కొద్దిరోజులకే వీరిద్దరకీ మనస్పర్థలు రావడంతో క్రాంతి భర్తను వదిలి పుట్టింటికి వెళ్లి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. 
 
విచారణ ఖైదీగా ఉన్న ప్రదీప్ ఇటీవలే బెయిల్‌ మీద విడుదలై వచ్చి భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతం చేయాలని పథకం పన్నాడు. తల్లితో కలిసి రోడ్డు మీద వెళ్తున్న క్రాంతిని దారుణంగా నరికి కసి తీరక ఆమె తలను మొండెం నుండి వేరు చేశాడు. ఆమె తల తీసుకుని రోడ్డు మీద వెళ్తుండగా గమనించిన స్థానికులు గట్టిగట్టిగా కేకలు వేయడంతో ఆ తలను కాలువలోకి విసిరేశాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తన భర్త నుంచి ప్రాణ హాని ఉందని క్రాంతి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిందని క్రాంతి తల్లి వాపోతుంది. పోలీసులు తగిన చర్యలు తీసుకుని ఉంటే తన కుమార్తె బత్రికుండేదని చెబుతోంది.