శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 10 ఆగస్టు 2019 (16:02 IST)

ప్రియుడితో తల్లి ఏకాంతం... కళ్ళారా చూసిన కొడుకు ఏం చేశాడంటే..?

తన తల్లితో అక్రమ సంబంధం జీర్ణించుకోలేని కొడుకు తల్లిని అతి కిరాతకంగా హత్య చేశాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది. గుడిపాల మండలం రెట్టగుంట దళితవాడ గ్రామానికి చెందిన డేవిడ్ రాజ్ భార్య జ్యోతి సొంత మరిది సుందర్ రాజు మధ్య గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. జ్యోతి కుమారుడు ప్రేమ్ కుమార్‌కు వీరి విషయం తెలియడంతో తల్లిని పలుమార్లు మందలించినప్పటికీ మార్పు కనిపించలేదు.
 
దీంతో పూటుగా మద్యం సేవించి తల్లి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించాడు. దీనిపై తల్లి.. కుమారుడు మధ్య గొడవ జరిగింది. కుమారుడి దౌర్జన్యాన్ని జీర్ణించుకోలేని తల్లి జ్యోతి కుమారుడిపై గుడిపాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రేమ్ కుమార్‌ను మందలించి పంపారు. తల్లిపై కోపంతో అర్థరాత్రి వేళ ఇల్లు వదిలివెళ్ళిన ప్రేమ్ కుమార్ కొద్దిసేపటి తరువాత ఇంటికి వచ్చాడు.
 
ఇంట్లో తన తల్లి ప్రియుడు సుందరరాజన్‌తో కలిసి ఉండటాన్ని చూపి ఓర్చుకోలేకపోయాడు. ఆవేశానికి గురైన ప్రేమ్ కుమార్ తల్లి జ్యోతిని కత్తితో గొంతు కోసేశాడు. అడ్డొచ్చిన సౌందర్ రాజపై కత్తితో దాడికి దిగాడు. అయితే సౌందర్ రాజన్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. తల్లిన హత్య చేసిన అతడు నేరుగా పోలీస్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు.