శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 20 జనవరి 2020 (22:00 IST)

మూడ్ కోసం అది వాడాడు... ఏది చూసినా ఎర్రగా కనబడుతోందట

శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనడానికి.. మూడ్ త్వరగా రావడానికి చాలామంది వయాగ్రా వాడుతుంటారు. అయితే ఓ వ్యక్తి ఈ వయాగ్రా వాడటం అలవాటుగా మార్చుకున్నాడు. ఒకవిధంగా చెప్పాలంటే దానికి బానిసగా మారిపోయాడు. చివరకు లైంగిక సమస్యకు చెక్ పెడదామనుకుని చేసుకున్న అలవాటు కాస్తా కంటి చూపుకే ఎసరు తెచ్చిపెట్టింది. 
 
చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని బైరెడ్డిపల్లికి చెందిన రాజేంద్రప్రసాద్ లైంగిక సమస్యతో బాధపడుతుండేవాడు. దీంతో అతను వయాగ్రాకు అలవాటుపడ్డాడు. అది ఓవర్‌డోస్ కావడంతో అతని కళ్ళలోని రెటీనాపై ప్రభావం పడింది. అది క్రమేణా దృష్టి లోపం ఏర్పడి రంగులను గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. అతనికి ప్రస్తుతం ఎర్రరంగు తప్ప మరేదీ కనిపించలేదట. 
 
దీంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. తిరిగి మామూలు పరిస్థితికి వస్తారో లేదో చెప్పలేమని డాక్టర్లు తేల్చేశారట. చాలామంది ఏదైనా ఒకదానిని కొద్దిగా తీసుకోవడం మొదలుపెడితే కొంచెం తీసుకుంటనే ఇంత బాగుందంటే ఎక్కువ తీసుకుంటే ఇంకా బాగుంటుందని అనుకుని ఇలాంటి పరిణామాలు ఎదుర్కొంటూ ఉంటారని వైద్యులు చెబుతున్నారు. ఏదైనా మితంగా తీసుకుంటేనే ఎలాంటి సమస్యలు రావంటున్నారు.