శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జనవరి 2020 (16:32 IST)

సూపర్ మ్యాన్‌లా మారిన కోహ్లీ.. అద్భుత క్యాచ్‌ (వీడియో)

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బ్యాటింగ్‍లోనే కాకుండా బౌలింగ్‌లోనూ తన సత్తా ఏంటో చూపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో వన్డేలో కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్‌ను పట్టి... అదరగొట్టాడు. సూపర్‌మ్యాన్‌లా గాల్లోకి అమాంతం డైవ్ చేస్తూ బంతిని ఒడిసిపట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆసీస్ మ్యాచ్ సందర్భంగా జడేజా వేసిన 32వ  ఓవర్లో లబుషేన్ కవర్స్ దిశగా షాట్ ఆడాడు. 
 
వెంటనే కోహ్లీ మెరుపు వేగంతో డైవ్ చేస్తూ బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో స్మిత్ లబుషేన్ 127 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయించి మ్యాచ్‌ను గెలుచుకునేలా చేశారు. 
 
ఇకపోతే అద్భుత క్యాచ్‌తో మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ ఇచ్చిన కోహ్లీపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేగాకుండా కోహ్లీ క్యాచ్ అనంతరం తన క్యాప్‌ను తీసి అభిమానులకు అభివాదం చేయడం ఈ మ్యాచ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇంకేముంది..? కోహ్లీ క్యాచ్‌ను మీరూ ఓ లుక్కేయండి.