శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 30 ఏప్రియల్ 2018 (15:14 IST)

అమరావతి సచివాలయాన్ని సందర్శించాలంటే... ఆధార్ తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలోని అమరావతి సచివాలయాన్ని సందర్శించాలంటే ఇకపై ఆధార్ తప్పనిసరి. సచివాలయాన్ని సందర్శించాలంటే సందర్శకులకు ఇక ఆధార్ నంబర్ తప్పనిసరి అని సాధారణ పరిపాలనా శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అధికారిక, వ్యక్తిగత పనులపై సచివాలయానికి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలోని అమరావతి సచివాలయాన్ని సందర్శించాలంటే ఇకపై ఆధార్ తప్పనిసరి. సచివాలయాన్ని సందర్శించాలంటే సందర్శకులకు ఇక ఆధార్ నంబర్ తప్పనిసరి అని సాధారణ పరిపాలనా శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అధికారిక, వ్యక్తిగత పనులపై సచివాలయానికి వచ్చేవారిని లోపలకు అనుమతించే ముందు వారి గుర్తింపునకు సంబంధించి పూర్తి వివరాలతో కొత్త పాస్‌లు ఇవ్వాలని నిర్ణయించారు.
 
అందువల్ల సందర్శకులు తమ వెంట ఆధార్ నెంబర్‌ను తప్పనిసరిగా తీసుకువచ్చి, సంబంధింత అధికారికి తెలియజేయాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ నెంబర్ ఆధారంగా వారి వివరాలు కంప్యూటర్‌లో నమోదు చేసి పాస్ ఇస్తారు.