బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 1 సెప్టెంబరు 2016 (20:00 IST)

శని మంత్రితో హోదా రాదు... బాబు ఇంటి ముందే సుసైడ్ చేస్కుంటా... నటుడు శివాజీ సంచలనం

ఏపీ ప్రత్యేక హోదా హీట్ ఇంకా ఎక్కువవుతోంది. ఒకపక్క పవన్ కళ్యాణ్ కాకినాడ మీటింగ్ సమయం దగ్గరపడుతుంటే ఇంకోవైపు కేంద్రం తనదైన శైలిలో ప్రత్యేక హోదా వ్యవహారంపై మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో సుజనా చౌదరి గురువారం రాత్రి ఢిల్లీలో మాట్లాడుతూ... ప్రత్

ఏపీ ప్రత్యేక హోదా హీట్ ఇంకా ఎక్కువవుతోంది. ఒకపక్క పవన్ కళ్యాణ్ కాకినాడ మీటింగ్ సమయం దగ్గరపడుతుంటే ఇంకోవైపు కేంద్రం తనదైన శైలిలో ప్రత్యేక హోదా వ్యవహారంపై మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో సుజనా చౌదరి గురువారం రాత్రి ఢిల్లీలో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని చెప్పారు. హోదా కోసం కేంద్రంతో మాట్లాడుతూనే ఉన్నామని చెప్పారు. ఆయన మీడియా సమావేశాన్నంతా ఆసాంతం చూసిన నటుడు శివాజీ ప్రైవేట్ ఛానల్లో ప్రత్యక్షమయ్యాడు.
 
ఆయన మాట్లాడుతూ... అంతర్జాతీయ బ్యాంకు స్కాములో ఇరుక్కున్న కేంద్రమంత్రి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు శనిలా దాపురించాడని మండిపడ్డారు. సుజనాకు బ్యాంకుల స్కాముపై ఉన్నంత అవగాహన ఆంధ్రప్రదేశ్ సమస్యలపై లేదని అన్నారు. ఏపీ ప్రభుత్వం ప్యాకేజీకి తలాడిస్తే తను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. తక్షణం సుజనా చౌదరిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా శివాజీ సుసైడ్ వ్యాఖ్యలతో మరోసారి కలకలం రేగుతోంది.