సోమవారం, 14 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By DV
Last Modified: గురువారం, 5 జనవరి 2017 (19:38 IST)

అలా తొక్కేస్తారన్న భయం నాకేమీ లేదు... నటి హేమ

నటి హేమ కాకినాడలో కాపు రిజర్వేషన్లకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో గురువారంనాడు పాల్గొంది. కాపు మహిళ సదస్సులో ఆమె మాట్లాడుతూ... కాపు ఉద్యమనేత, ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి తాను ఉడతాభక్తిగా సాయం అందించేందుకు సినీ పరిశ్రమ నుంచి తనకు తానుగా వచ్చినట్లు తెలి

నటి హేమ కాకినాడలో కాపు రిజర్వేషన్లకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో గురువారంనాడు పాల్గొంది. కాపు మహిళ సదస్సులో ఆమె మాట్లాడుతూ... కాపు ఉద్యమనేత, ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి తాను ఉడతాభక్తిగా సాయం అందించేందుకు సినీ పరిశ్రమ నుంచి తనకు తానుగా వచ్చినట్లు తెలిపారు. ఉద్యమంలో పాల్గొంటే చిత్ర పరిశ్రమలో అవకాశాలు రాకుండా తొక్కేస్తారన్న భయం తనకు లేదని ఆమె అన్నారు. 
 
కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఇతర కులాల నాయకులు ఎందుకు ఆ పార్టీ నుంచి పోటీ చేశారని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఈ సదస్సులో పాల్గొన్నవారంతా కంచాలను గరిటలతో కొడుతూ మహిళలు తమ నిరసన తెలిపారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కిరణ్‌ కుమార్‌ రెడ్డి 'జై సమైక్యాంధ్ర పార్టీ' తరపున హేమ ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే.