శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2016 (14:02 IST)

చిన్నమ్మకు చిక్కులు... ప్రధాని మోడీ వద్ద తేల్చుకుంటానంటున్న జయమ్మ మేనకోడలు దీప

అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి కావాలని భావవిస్తున్న చిన్నమ్మ శశికళకు చట్టపరమైన చిక్కులు తప్పేలా లేవు. శశికళను చట్టపరంగా ఎదుర్కొనేందుకు వ్యతిరేక వర్గం రంగం సిద్ధమవుతోంది. ఈనెల 29వ తేదీన జరుగనున్న పార్టీ

అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి కావాలని భావవిస్తున్న చిన్నమ్మ శశికళకు చట్టపరమైన చిక్కులు తప్పేలా లేవు. శశికళను చట్టపరంగా ఎదుర్కొనేందుకు వ్యతిరేక వర్గం రంగం సిద్ధమవుతోంది. ఈనెల 29వ తేదీన జరుగనున్న పార్టీ సర్వసభ్య సమావేశానికి శశికళ మద్దతుదారులకు మాత్రమే ఆహ్వానాలు పంపుతున్నారు. కానీ, తమను ఆహ్వానించకున్నప్పటికీ... ఈ సమావేశాన్ని అడ్డుకుంటాం. విఫలమైతే చట్టపరంగా సాధిస్తామని వ్యతిరేకవర్గం ధీమా వ్యక్తం చేస్తోంది.
 
పార్టీలో ప్రాథమిక సభ్యత్వమేలేని శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎలా ఎన్నుకుంటారని వ్యతిరేక వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ నియమావళి ప్రకారం ఒక సభ్యునిపై క్రమశిక్షణ చర్య తీసుకుంటే ఐదేళ్ళపాటు అతను ఎన్నికల్లో పోటీచేసేందుకు వీల్లేదు. 2011 డిసెంబర్‌లో శశికళను ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. 2012 మార్చిలో తిరిగి జయ వద్దకు వచ్చారు. 
 
అయితే శశికళకు ప్రాథమిక సభ్యత్వ కార్డును జయలలిత జారీ చేయలేదు. వీటిని పరిగణలోకి తీసుకోకుండా పార్టీ నిబంధనలను సవరించి శశికళను ఎన్నుకుంటే అది చట్ట వ్యతిరేకమే అవుతుంది. ఎన్నికల కమిషన్‌ సంప్రదాయాన్ని విస్మరించి శశికళ మాత్రమే నామినేషన్‌ వేసేలా పార్టీ పెద్దలు వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్‌లో పిటిషన్‌ వేసేందుకు సిద్ధంగా ఉన్నాం అని వ్యతిరేక వర్గం పేర్కొంటోంది. 
 
అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీని జయలలిత అన్న కుమార్తె, మేలకోడలు అయిన దీప నేరుగా కలువనున్నారు. శశికళ వ్యతిరేకవర్గం పన్నీరుసెల్వం లేదా దీపను ప్రధాన కార్యదర్శి చేయాలని పట్టుబడుతున్నారు. దీప పేరవై అనే సంస్థను స్థాపించి జోరుగా సభ్యత్వాన్ని చేరుస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలని దీపపై రోజురోజుకు ఒత్తిడి పెరుగుతోంది. అన్నాడిఎంకే రాజకీయాలను బిజెపి తెర వెనుక ఉండి శాసిస్తున్నట్లు ఉవ్వెత్తున ప్రచారం సాగుతున్న నేపథ్యంలో దీప ప్రధానిని కలుసుకునేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం.