నంద్యాల రాజకీయాలు: వైఎస్ జగన్ తల్లి విజయమ్మను కలిసిన భూమా అఖిలప్రియ
తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా నంద్యాల బరిలో ఎవరుంటారన్న విషయంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. సీటు తమ కుటుంబానిదే కాబట్టి తమకు అవకాశం ఇవ్వాలని భూమా కుటుంబం అంటుండగా, పార్టీలో అనాదిగా ఉంటున్న తనకు అవకాశం
తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా నంద్యాల బరిలో ఎవరుంటారన్న విషయంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. సీటు తమ కుటుంబానిదే కాబట్టి తమకు అవకాశం ఇవ్వాలని భూమా కుటుంబం అంటుండగా, పార్టీలో అనాదిగా ఉంటున్న తనకు అవకాశం ఇవ్వాలని శిల్పా పట్టుబడుతుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
నంద్యాల ఉప ఎన్నికలకు సమయంలో దగ్గర పడుతున్న వేళ, తన సోదరుడు బ్రహ్మానందరెడ్డి పోటీకి దిగుతాడని.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించాలని కోరుతూ.. ఏపీ టూరిజం మంత్రి భూమా అఖిలప్రియ, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ తల్లి విజయమ్మను కలిసినట్టు తెలుస్తోంది.
ఈ విషయం అధికారిక సమాచారం లేనప్పటికీ.. తన తల్లిదండ్రులతో వైఎస్ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రస్తావించిన ఆమె, బ్రహ్మానందరెడ్డికి ఓ చాన్స్ ఇవ్వాలని విజయమ్మను అభ్యర్థించినట్టు సమాచారం. కాగా, ఇప్పటికే, వైకాపా తరఫున తాను బరిలో ఉంటానని గంగుల ప్రతాపరెడ్డి చెప్పుకోగా, ఇటీవలి నంద్యాల వైకాపా ప్లీనరీలో కర్నూలు జిల్లా నేతలు నియోజకవర్గ ఇన్ చార్జ్ రాజగోపాల్ రెడ్డి పేరును ప్రస్తావించిన సంగతి తెలిసిందే.