సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2019 (13:19 IST)

ఆ విషయంలో పవన్ కళ్యాణ్ విఫలమయ్యారు : జనసేన నేత

తన ఆలోచనలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమయ్యారని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన తూర్పుగోదావరి కాకినాడలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, కుల రాజకీయాలు చేసి క్లిక్ అయిన రాజకీయ నేతలు ఇప్పటివరకు లేరన్నారు. పైగా, కుల సమీకరణాలతో రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం భంగపాటు తప్పదన్నారు.
 
అదేసమయంలో పవన్ కళ్యాణ్ తన ఆలోచనలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు కులాలను అడ్డుపెట్టుకుని ఓ చెంపపెట్టువంటివన్నారు. కాగా, బీజేపీ మాజీ నేత అయిన ఆకుల సత్యనారాయణ జనసేనకు రాజీనామా చేసి తిరిగి సొంత పార్టీలోకి వెళతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.