గురువారం, 10 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 9 అక్టోబరు 2014 (19:01 IST)

ఆళ్ళగడ్డ ఉప ఎన్నిక బరి... వైసీపీ అభ్యర్థి అఖిల ప్రియ

ఆళ్లగడ్డ శాసన సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా దివంగత మహిళా నేత భూమా శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియను ఖరారు చేశారు. గత ఎన్నికల సమయంలో శోభానాగిరెడ్డి ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఐతే ఆళ్లగడ్డ ఎన్నికలో అఖండ విజయాన్ని మరణించాక కూడా శోభకే ఓటర్లు కట్టబెట్టారు.
 
ఈ నేపధ్యంలో భూమా నాగిరెడ్డి - దివంగత భూమా శోభానాగిరెడ్డి పెద్ద కుమార్తె అయిన భూమా అఖిల ప్రియను ఆళ్ళగడ్డ ఉప ఎన్నికల్లో బరిలోకి దించేందుకు జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో శోభానాగిరెడ్డి ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో కారు ప్రమాదంలో మరణించారు. ఆమె మరణించినా ఆళ్లగడ్డ ఎన్నికలో అఖండ విజయం సాధించి దేశంలోని ఓ అరుదైన రికార్డును సాధించారు. 
 
ఇప్పుడు ఆ స్థానానికి ఉప ఎన్నికల జరపాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ స్థానం నుంచి భూమా అఖిలారెడ్డిని ఆళ్ళగడ్డ ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకంలో వైసీపీ నాయకులు వున్నారు. ఈ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉండాలని భావిస్తోంది.