సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 23 మే 2017 (20:07 IST)

అమరావతి రాజధాని... హరితశోభిత రవాణా వ్యవస్థ

అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన హరితశోభిత మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన ఎపి క్యాపిటల్ రీజియన్ యూన

అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన హరితశోభిత మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన ఎపి క్యాపిటల్ రీజియన్ యూనిఫైడ్ ట్రాన్సుపోర్టు అధారిటీ(AP CRUTA) సమావేశం జరిగింది. 
 
ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మెరుగైన గ్రీన్ ఫీల్డు రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా అవసరమైన ప్రణాళికలను, ప్రతిపాదనలను సిద్ధం చేసి త్వరితగతిన చేపట్టేందుకు కృషి చేయాలని కమిటీకి సూచించారు. సెన్సారు ఆధారిత ట్రాఫిక్ సిగ్నలింగ్ విధానం వంటివి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ నగరాల్లోని రవాణా వ్యవస్థను అధ్యయనం చేసినందున మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
 
విజయవాడ నగంలో ట్రాఫిక్ రద్దీని అధికమించేందుకు ప్రతిపాదిత బైపాస్ రహదారి నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.అదేవిధంగా విజయవాడ నగరంలో ప్రతిపాదించిన బెంజ్ సర్కిల్ ప్లైఓవర్ నిర్మాణ పనులు కూడా త్వరగా జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు.అందుకు అనుగుణంగా ట్రాఫిక్ మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.రానున్న వారం వారీ సమీక్షల్లో ఈరెండు అంశాలను సమీక్షించడం జరుగుతుందని సిఎస్ స్పష్టం చేశారు.
 
ఈ సమావేశంలో సిఆర్డిఏ కమీషనర్ మరియు కమిటీ మెంబర్ కన్వీనర్ సిహెచ్ శ్రీధర్ అమరావతి రాజధాని ప్రాంతంలో చేపట్టనున్న రహదారులు, రవాణా వ్వస్థలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.రాజధానిలో 2050 నాటికి పెరిగే జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ఫీల్డుతో కూడిన కాలుష్య రహిత మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని వివరించారు. 
 
ఇందుకు సంబంధించి ఒక సమగ్రమైన మాస్టర్ ప్రణాళిక రూపకల్పనకు ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. అలాగే ఒక కన్సల్టెంట్ వ్యవస్థను నియమించు కోవడం జరుగుతోందని చెప్పారు. అనంతరం రాజధాని ప్రాంత పరిధిలో చేపడుతున్న వివిధ రహదారులు,ఇతర అంశాలపై ప్రవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిఆర్డిఏ కమీషనర్ శ్రీధర్ వివరించారు. ఈ సమావేశంలో సిఆర్డిఏ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్,పట్టణ పరిపాలనాశాఖ ముఖ్యకార్యదర్శి కరికాలవలవన్,విజయవాడ మున్సిపల్ కమీషనర్ నివాస్,అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టు ఎండి రామకృష్ణా రెడ్డి,ఇంకా కమిటీలో సభ్యులైన పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.