శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 17 జులై 2019 (08:41 IST)

14 ఏళ్ల బాలిక పట్ల 75 ఏళ్ల వృద్ధుడు ఏం చేశాడో చూడండి

బాలిక పట్ల ఓ వృద్ధుడు అసభ్య ప్రవర్తనతో పాటు లైంగిక వేధింపులకు గురి చేస్తున్న సంఘటన నగరు శివారు నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
పాయికాపురం రాజీవ్ నగర్ కు చెందిన జాన్ బాబు(75), అదే ప్రాంతానికి చెందిన  14 ఏళ్ల బాలిక పట్ల అసభ్యగా  ప్రవర్తిస్తున్నాడు. ఇంతే కాక లైంగికంగా వేదిస్తున్నట్టు నున్న  పోలీసులు మంగళవారం ఉదయం కేసు నమోదు చేశారు. పాఠశాలకు వెళ్లి వస్తున్న బాలిక పట్ల గత కొద్దిరోజులుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు.
వాళ్ల తల్లిదండ్రులకు విషయం తెలిసి  అతను మందలించిన అప్పటికీ మరింత ఎక్కువగా వేధింపులకు గురిచేయడంతో బాలిక తల్లిదండ్రులు మన పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.