శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 16 జులై 2019 (15:27 IST)

నిన్ను నమ్ముకుని వస్తే.. నీ స్నేహితులను పిలుస్తావా?

ప్రేమిస్తున్నానని నమ్మబలికిన యువకుడి ఇంటికి 16 ఏళ్ల బాలిక వెళ్లింది. కానీ వచ్చిన తర్వాతే తెలిసింది. అతనో మోసగాడని. ''నిన్ను నమ్ముకునే కదా వచ్చాను..'' అంటూ రోదించింది. ఇంకా అతని స్నేహితులకు బలికాకుండా తప్పించుకుంది. ఈ ఘటన తమిళనాడు పొల్లాచ్చిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పొల్లాచ్చికి చెందిన 16 ఏళ్ల బాలిక పదవ తరగతి చదువుతోంది. 
 
ఈ బాలిక తల్లి చనిపోవడంతో ఆమె తండ్రి రెండో పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. ఆ బాలిక అమ్మమ్మ వద్ద పెరిగింది. ఈ నేపథ్యంలో పొల్లాచ్చి, కుమరన్ నగర్‌కు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఓ రోజు ఆ బాలికను ఇంటికి రమ్మని ప్రేమికుడు పిలిచాడు. ఇంటికెళ్లిన ఆ బాలిక ప్రేమికుడితో మాట్లాడుతుండగా.. అతని స్నేహితులు ఇంట్లోకి దూరారు. 
 
దాన్ని చూసి షాకైన బాలిక.. వారు లైంగిక వేధింపులకు గురిచేసేందుకు ప్రయత్నించగానే ఆ ఇంటి నుంచి బయటపడింది. వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించిన ప్రేమికుడితో పాటు స్నేహితులను అరెస్ట్ చేశారు.