ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (11:25 IST)

పక్కలోకి రాలేదనీ.. భార్యను ఫ్యాన్‌కు ఉరివేసి చంపేసిన భర్త

రాత్రిపూట పక్కలో పడుకోవడం లేదని ఆగ్రహించిన ఓ కసాయి భర్త... కట్టుకున్న భార్యను ఫ్యాన్‌కు ఉరివేసి చంపేశాడు. ఈ దారుణం అనంతపురం జిల్లా పామిడి మండలంలోని రామగిరి గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

రామగిరి హనుమన్న, ఈశ్వరమ్మ దంపతుల పెద్దకుమార్తె తిరుపతమ్మ (35)ను కొప్పలకొండకు చెందిన సుధాకర్‌కు ఇచ్చి 15 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. కర్నాటకకు చెందిన మరో మహిళను సుధాకర్‌ రెండో వివాహం చేసుకున్నాడు. ఈమె కూడా భర్త వేధింపులు భరించలేక మూడేళ్ళ క్రితం విడిచి వెళ్లిపోయింది. 
 
ఈ నేపథ్యంలో మళ్లీ మొదటి భార్య చెంతకే చేరాడు. ఆమెతో కలిసి కొప్పలకొండలోనే కాపురం చేయసాగాడు. నెల నుంచి తిరుపతమ్మతో సుధాకర్‌ గొడవ పడుతుండటంతో విసిగిపోయిన ఆమె పుట్టింటికి వచ్చేసింది. మంగళవారం రాత్రి భార్యతో గొడవపడి ఫ్యాన్‌కు ఉరివేసి చంపి పారిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న భర్త కోసం గాలిస్తున్నారు.