సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: గురువారం, 13 సెప్టెంబరు 2018 (21:09 IST)

కోతులను చంపడంతోనే కొండగట్టు ఆంజనేయుడికి కోపమా... అందుకే ప్రమాదం జరిగిందా?

కొండగట్టు అంజన్నకు ఆగ్రహం వచ్చిందా? ఆంజనేయుడుకి ప్రతిరూపమని భావించే వానరాలను చంపడం వల్లే బస్సు ప్రమాదం సంభవించిందా? జగిత్యాల వాసులు ఎక్కడ కలిసినా ఇవే అంశాలు చర్చించుకుంటున్నారు. నాలుగు రోజులు క్రితం కొడిమ్యాల మండలం సూరంపేట మామిడివాగు సమీపంలోని గోవి

కొండగట్టు అంజన్నకు ఆగ్రహం వచ్చిందా? ఆంజనేయుడుకి  ప్రతిరూపమని భావించే వానరాలను చంపడం వల్లే బస్సు ప్రమాదం సంభవించిందా? జగిత్యాల వాసులు ఎక్కడ కలిసినా ఇవే అంశాలు చర్చించుకుంటున్నారు. నాలుగు రోజులు క్రితం కొడిమ్యాల మండలం సూరంపేట మామిడివాగు సమీపంలోని  గోవిందారం దారి ప్రక్కన 60 కోతుల కళేబరాలు కనిపించాయి.
 
గుర్తు తెలియని వ్యక్తులు కరెంట్ షాక్ పెట్టి కోతులను హతమార్చినట్టుగా ఉందని కొడిమ్యాల రేంజర్ బుర్ర లత అభిప్రాయపడ్డారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే... అదీ అంజన్నకు ప్రీతిపాత్రమైన మంగళవారమే కొండగట్టు ఘాట్ రోడ్ పైన బస్సు బోల్తా పడటం, ఈ ప్రమాదంలో 60 మంది ప్రాణాలు కోల్పోవటం జరిగింది. 
 
కోతులు కళేబరాలు లభ్యమైన సంఖ్యలోనే ప్రయాణికులు మృతి చెందడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కోతులను చంపడంతోనే అంజన్నకు ఆగ్రహం వచ్చి వుంటుందని చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వాపోతున్నారు.