శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 12 సెప్టెంబరు 2018 (11:05 IST)

బెస్ట్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే కొండగట్టు ప్రమాదం... 58కి చేరిన మృతులు

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ప్రమాదానికి అసలు కారణం నిర్లక్ష్యమని తేలింది. గతనెల 15వ తేదీన ఉత్తమ డ్రైవర్‌గా అవార్డును అందుకున్న ఈ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇపుడు నిర్లక్ష్యంగ

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ప్రమాదానికి అసలు కారణం నిర్లక్ష్యమని తేలింది. గతనెల 15వ తేదీన ఉత్తమ డ్రైవర్‌గా అవార్డును అందుకున్న ఈ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇపుడు నిర్లక్ష్యంగా బస్సును నడిపి ఏకంగా 58 మంది ప్రయాణికుల మృతికి కారణమయ్యాడు.
 
ఘాట్ రోడ్డుపై వస్తున్న సమయంలో కారును తప్పించబోయి ఆటోను ఢీకొట్టాడు. ఆ తర్వాత బస్సు అదుపుతప్పింది. అక్కడే ఉన్న స్పీడ్ బ్రేకర్ ఎక్కడంతో బస్సు ఎగిరింది. దీంతో ప్రయాణికులంతా డ్రైవర్ వైపుకు ఒరిగిపోయారు. దీంతో బస్సు అదుపుతప్పి రెండు పల్టీలు కొట్టి లోయలోకి దూసుకెళ్లింది. 
 
ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య కూడా 58కు చేరింది. దేశంలోనే అతిపెద్ద రోడ్డు ప్రమాదంగా చెబుతున్నారు. చనిపోయిన వారిలో 36 మంది మహిళలు, 16 మంది పురుషులు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ప్రమాదంలో బస్సు డ్రైవర్ శ్రీనివాస్ కూడా చనిపోయారు. కండక్టర్  తీవ్ర గాయాలతో  చికిత్స తీసుకుంటున్నారు. 
 
40 మంది ఎక్కాల్సిన బస్సులో పరిమితికి మంచి అంటే డ్రైవర్, కండక్టర్‌తో కలుపుకుని ఏకంగా 104 మంది ప్రయాణికులు ఎక్కారు. కొండగట్టు నుంచి బయలుదేరిన బస్సు మరో నిమిషంలో ఘాట్ రోడ్డు నుంచి ప్రధాన రహదారికి చేరుతుందనగా ఘోరం జరిగిపోయింది. డ్రైవర్ కారును తప్పించబోయాడు. అక్కడే ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పి బస్సు లోయలోపడిపోయింది. 
 
కాగా, బస్సు ప్రమాదానికి కారణమని చెబుతున్న డ్రైవర్ శ్రీనివాస్.. ఈ ఏడాది ఆగస్టు 15న ఉత్తమ డ్రైవర్‌గా అవార్డు అందుకున్నాడు. ప్రమాదం కారణంగా సస్పెండ్ అయిన జగిత్యాల ఆర్టీసీ డీఎం హన్మంతరావు కూడా అవార్డు తీసుకున్నారు. ఉత్తమ ఎంప్లాయీస్‌గా గుర్తింపుపొందిన ఈ ఇద్దరే  ప్రస్తుత ప్రమాదానికి కారణంగా నిలిచారు.