గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2016 (10:38 IST)

భార్యపై అనుమానం.. కిరోసిన్ పోసి నిప్పంటించాడు..

నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై దురాగతాలు సైతం పెరిగిపోతున్నాయి. తాజాగా అనుమానమే పెనుభూతమైంది. భార్యను కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ భర్త. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళి

నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై దురాగతాలు సైతం పెరిగిపోతున్నాయి. తాజాగా అనుమానమే పెనుభూతమైంది. భార్యను కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ భర్త. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రానికి చెందిన షేక్షావలి, రేష్మిలు భార్య భర్తలు. వీరికి ముగ్గరు పిల్లలు ఆషిపా(11) షాజియా(9)సాదిక్(4)లు ఉన్నారు. 
 
అయితే... గత కొద్దిరోజులుగా వీరి కుటుంబంలో కలహాలు ప్రారంభమయ్యాయి. దీనికి తోడు రేష్మిపై షేక్షావలికి అనుమానం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి రేష్మిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో కాలిన గాయాలతో ఆమె మృతి చెందింది. పోలీసులు షేక్షావలిని అదుపులోకి తీసుకున్నారు.