శనివారం, 8 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (21:53 IST)

అవయవదానం చేసిన నవ జంట... 60 మంది వధూవరుల బంధువులు కూడా..?

ఏపీకి చెందిన ఓ నవ దంపతులు తమ అవయవాలను దానం చేసి.. ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఈ ప్రపంచంలో ప్రమాదాలు, పుట్టుకతో వచ్చే వైకల్యాలు మొదలైన వాటి వల్ల చాలా మంది బాధపడుతున్నారు. వారికి సహాయం చేయడానికి, ఈ అవయవ దానం గ్రహీతల పునరావాసంలో సహాయపడుతుంది. 
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు, అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రాలోని సతీష్ కుమార్-సజీవరాణి దంపతులు తమ అవయవాలను దానం చేస్తామని హామీ ఇచ్చారు. 
 
డిసెంబర్ 29న వీరి వివాహం జరగనున్న నేపథ్యంలో దాదాపు 60 మంది వధూవరుల బంధువులు కూడా ఈ జోడీతో తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావడం విశేషం. 
 
విశాఖపట్నంలోని సావిత్రీబాయి ఫూలే ఎడ్యుకేషన్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ జి. సీతామహాలక్ష్మి పెళ్లి రోజున అవయవదాన ఫారాలను అందుకోనున్నారు. విల్లింగ్ టు హెల్ప్ ఫౌండేషన్ సహకారంతో సతీష్ కుమార్ తన పెళ్లి రోజున అవయవదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు.