శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (13:01 IST)

కృష్ణా - గోదావరి నదులకు మళ్లీ వరద హెచ్చరిక

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులకు మళ్లీ వరద రావొచ్చని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్జీటీఎస్) హెచ్చరించింది. దీనిపై ఆర్జీటీఎస్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. 
 
అంతేకాకుండా, ఈ నెల 22వ తేదీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. 
దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 23 నుండి 26వ తేదీ వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
 
19వ తేదీ అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. ఫలితంగా గుజరాత్ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపారు. మహారాష్ట్రలో వర్షాల వల్ల కృష్ణా, గోదావరి నదులకు భారీగా రానుందని పేర్కొంది. 
 
ఈ నెల 21 నుండి అక్టోబరు 2వ తేదీ వరకు కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరద సంభవించే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో భారీగా వదర వచ్చే అవకాశాలున్నట్టు తెలిపింది. అందువల్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కోరింది.