ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (15:30 IST)

ఏపీ పౌరసరఫరాల శాఖలో భారీగా ఉద్యోగాలు

Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌సీ ఎస్సీఎల్) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ శాఖలో ఏకంగా 4033 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2023-24 సీజన్‌లో వరి సేకరణ సేవలకు సంబంధించి రెండు నెలల కాలానికి ఈ పోస్టులను భర్తీ చేస్తారు. 
 
ఈ పోస్టులను కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా ఎంపిక కమిటీ ద్వారా భర్తీ చేస్తారు. ఈ మేరకు జిల్లా వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇప్పటికే వెస్ట్ గోదావరి, బాపట్ల, కోనసీమ, ఈస్ట్ గోదావరి, కాకినాడ జిల్లాల్లో ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల కాగా, తాజాగా విజయనగరం, ప్రకాశం, ఎన్టీఆర్, అనకాపల్లి జిల్లాల్లో ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. 
 
ఈ పోస్టులో టెక్నికల్ అసిస్టెంట్స్, డెటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్ తదితర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. అయితే, పోస్టుల ఆధారంగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టుల ఆధారంగా పదో తరగతి, డిగ్రీ, డిప్లొమా విద్యార్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.