సంబంధిత వార్తలు
- ఓబీసీ సర్టిఫికేట్లను రద్దు చేసిన కోల్‌కతా హైకోర్టు
- చిత్తు కాగితాలు సేకరించి జీవించే మహిళపై సామూహిక అత్యాచారం
- ఎలక్టోరల్ బాండ్ల వల్ల అవినీతి తగ్గింది... అదొక మంచి పథకం : ప్రధాని నరేంద్ర మోడీ
- ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులను రద్దు చేసిన భారత్!
- అత్యాధునిక రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్
ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు... నూతన ఇసుక పాలసీకి ఆమోదం.. ఏపీ మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌ను రద్దుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. అలాగే రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ మంత్రిమండలి సమావేశం జరిగింది. ఇందులో కొత్త ఇసుక పాలసీ కోసం విధి విధానాలను రూపకల్పన చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ రూ.2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదం లభించింది.
ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా, గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఏపి క్యాబినెట్ నిర్ణయం.#EndOfYCP #AndhraPradesh pic.twitter.com/l5Sa5DPJsa
— Telugu Desam Party (@JaiTDP) July 16, 2024
రైతు నుంచి ధాన్యం కొనుగోలు ఎన్సీడీసీ నుంచి రూ.3200 కోట్ల రుణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రుణం తీసుకునేందుకు వ్యవసాయ, సహకార కార్పొరేషన్‌కు ప్రభుత్వ క్యారంటీకి క్యాబినెట్ సమ్మతం తెలిపింది. అలాగే, ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
