సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 11 జులై 2019 (13:34 IST)

నీ సన్న బియ్యం సంగతి తేలుస్తా.. నువ్వు తేల్చలేవ్: మంత్రి కొడాలి నాని వర్సెస్ అచ్చెన్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మంత్రి కొడాలి నానిపై మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీల్లో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కనిపించడంతో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడు పలకరించారు. నల్లబడ్డావ్ ఏంటి నాని అంటూ సరదాగా అచ్చెన్నాయుడు పలకరించారు. జనంలో తిరుగుతున్నాం మీలా విశ్రాంతిలో లేను అంటూ నాని సమాధానం చెప్పారు. 
 
ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఇస్తామన్న సన్నబియ్యంపై ఇరువురు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్న నీ సన్నబియ్యం సంగతి తేలుస్తానంటూ చెప్పుకొచ్చారు. నువ్వు ఏమీ తేల్చలేవు, సన్న బియ్యం ఇచ్చి తీరుతామని ధీమా వ్యక్తంచేశారు. అవసరం అయితే నీకు కూడా ఒక బస్తా బియ్యం పంపిస్తానంటూ  మంత్రి కొడాలి నాని సమాధానం చెప్పారు. దీంతో ఇరువురు మధ్య జరిగిన సరదా సంభాషణ నవ్వులు కురిపించాయి.