ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 10 మే 2017 (14:22 IST)

లివర్, ఊపిరితిత్తులు ముక్కలయ్యాయి... 200 కి.మీ వేగంతో బుల్లెట్లా నిషిత్ కారు...

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ కారు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ చూసి పోలీసులు షాక్ అవుతున్నారు. 200 కిలోమీటర్ల వేగంతో కారు పిల్లర్‌ను ఢీకొనడంతో నిషిత్, రవి వర్మలు మరణించారని అంటున్నారు.

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ కారు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ చూసి పోలీసులు షాక్ అవుతున్నారు. 200 కిలోమీటర్ల వేగంతో కారు పిల్లర్‌ను ఢీకొనడంతో నిషిత్, రవి వర్మలు మరణించారని అంటున్నారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నిషిత్ కారు 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో మెట్రో పిల్లర్‌ని బెంజ్‌కారు ఢీకొట్టినట్లు స్పీడోమీటర్ ద్వారా తెలుస్తోందని పోలీసులు చెప్తున్నారు. 
 
ఈ ప్రమాదంలో కారు ఫ్రంట్ పార్ట్, ఇంజన్ తునాతునకలైందని.. బెంజ్ కార్‌ ప్రమాదానికి గురవడం.. అతివేగంతో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కావొచ్చునని పోలీసులు చెప్తున్నారు. కారు వేగంతో పిల్లర్‌ను ఢీకొన్న సమయంలో వెనుక టైర్లు పైకి లేచి కిందపడినాయి. ఈ వేగం కారణంగా డ్రైవర్ సీటులో వున్న నిషిత్ ఊపిరితిత్తులకు స్టీరింగ్ తగలడంతో లివర్‌ బాగా దెబ్బతిన్నదని.. ఛాతిలో ఉండే స్టెర్నమ్ బోన్ ఫ్రాక్చర్ అయ్యిందని వైద్యులు తెలిపారు. ఛాతికి తీవ్రగాయాలు కావడంతో ప్రమాదం జరిగిన పది నిమిషాల్లో నిషిత్, రాజా రవి చంద్ర మరణించివుంటారని వైద్యులు అంటున్నారు. 
 
జూబ్లీ హిల్స్‌లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిషిత్‌, రవిచంద్రలను బయటకు తీసేందుకు పోలీసులు గంట పాటు పోరాడారు. ఇద్దరికీ నడుం కిందిభాగంలో తీవ్ర గాయాలైనాయి. అతికష్టం మీద వాహనం నుంచి వారిని బయటకు తీసిన పోలీసులు అపోలో ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే వారిద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.