శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2016 (16:01 IST)

ఏపీలో హోదా సెగలు.. కేంద్రం వైఖరికి నిరసనగా ఈనెల 10న స్టేట్ బంద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా సెగలు తారా స్థాయికి చేరాయి. విభజన హామీ మేరకు ప్రత్యేక హోదాను కేటాయించకుండా, ప్రత్యేక ప్యాకేజీ కేటాయించడంపై రాష్ట్రంలో నిరసన సెగలు మిన్నంటుతున్నాయి. దీంతో ఏపీకి ప్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా సెగలు తారా స్థాయికి చేరాయి. విభజన హామీ మేరకు ప్రత్యేక హోదాను కేటాయించకుండా, ప్రత్యేక ప్యాకేజీ కేటాయించడంపై రాష్ట్రంలో నిరసన సెగలు మిన్నంటుతున్నాయి. దీంతో ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ నెల10న ఏపీ బంద్‌కు ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. 
 
కేంద్రం ప్రకటనను వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఇందుకు నిరసనగా గురువారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగాలని నిర్ణయించాయి. ఈ నెల 9న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సభకు తమ మద్దతు ఉంటుందని సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, మధు ప్రకటించారు. హోదా ప్రకటనపై కేంద్రం డొల్లతనాన్ని నిరసిస్తూ బంద్ రోజున కార్యక్రమాలు చేపడతామని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తెలిపారు. బంద్‌కు అన్ని పార్టీలు మద్ధతిస్తున్నాయని చెప్పారు.
 
ఈ బంద్‌కు విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ తమ హక్కుని... కేంద్రం వేసే భిక్ష కాదన్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా ఈ బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కేంద్రం ఏపీ చెవిలో క్యాబేజీ పువ్వులు పెట్టిందని జగన్ మండిపడ్డారు.