బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 మార్చి 2023 (11:40 IST)

తితిదే బోర్డుకు ఆర్బీఐ భారీ అపరాధం - ఎన్ని కోట్లు అంటే?

Tirumala
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు భారతీయ రిజర్వు బ్యాంకు తేరుకోలని షాకిచ్చింది. శ్రీవారికి భక్తులు సమర్పించే విదేశీ కరెన్సీని జమ చేయడంలో తీవ్ర స్థాయిలో నిబంధనలు ఉల్లంఘించినట్టు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ విషయంలో తితిదే చేసిన తప్పులకుగాను రూ.3 కోట్ల మేరకు జరిమానా కూడా విధించింది. పైగా, ఈ అపరాధాన్ని కూడా తితిదే చెల్లించడం గమనార్హం. ఈ విషయాన్ని తితిదే బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
 
"భక్తులు హుండీలో సమర్పించుకున్న రూ.30 కోట్లకు పైగా విదేశీ కరెన్సీని బ్యాంకులో జమ చేసేసమయంలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని పట్టించుకోలేదు. టీటీడీ ఎఫ్.సిఆర్.ఏ లైసెన్స్ 2018లోనే ముగిసింది. అయితే, ఏదో కారణఁ వల్ల దాన్ని ఇంతవరకు రెన్యువల్ చేయించుకోలేదు. దీంతో ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది.