సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జులై 2023 (21:09 IST)

భర్త మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసిన భార్య.. మొదటి భార్య రీల్స్ చూశాడని..?

Blade
భర్త మర్మాంగాన్ని రెండో భార్య బ్లేడుతో కోసేసిన ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముప్పాళ్ల గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు.. మనస్పర్థల కారణంగా మొదటి భార్యను దూరం పెట్టేశాడు. ఆపై ఒంటరిగా వున్న ఆనంద్ బాబు రెండో పెళ్లి చేసుకున్నాడు. 
 
వరమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్న ఆనంద్ బాబు.. మొదటి భార్య వీడియోలను ఇన్ స్టాలో చూస్తుండేవాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వరమ్మకు ఆనంద్ మధ్య గొడవ జరిగింది. ఆపై ఆగ్రహంతో నిద్రిస్తున్న భ‌ర్త‌పై దాడి చేసింది. భ‌ర్త మ‌ర్మాంగాల‌ను బ్లేడ్‌తో కోసి గాయ‌ప‌రిచింది. 
 
తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో బాధితుడిని నందిగామ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి కుటుంబ స‌భ్యులు త‌ర‌లించారు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.