ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 27 నవంబరు 2024 (23:05 IST)

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

Cyclone Fengal
Cyclone Fengal ఫెంగల్ తుఫాన్ ట్రిక్స్ ప్లే చేస్తోందని కొందరు వెదర్ మెన్లు చెబుతున్నారు. ఎక్కడ తీరాన్ని తాకుతుందన్నది సస్పెన్సుగా మారుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్న ఫెంగల్ బుధవారం ఉదయం చెన్నై నగరానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 550 కి.మీ దూరంలో కేంద్రీకృతమై వుంది. 
 
వచ్చే 12 గంటల్లో అది ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందనీ, మరో రెండు రోజుల్లో తమిళనాడు తీరంలో ఇది కేంద్రీకృతమవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ తుఫాన్ ప్రభావంతో గురు, శుక్ర వారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.