సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శనివారం, 21 ఆగస్టు 2021 (15:00 IST)

అంజుమన్ ట్రస్టీగా అష్రాఫ్ ఖాన్ ప్రమాణ స్వీకారం

గుంటూరు జిల్లా మంగళగిరి అంజుమన్ కార్యాలయంలో అంజుమన్ ట్రస్టీగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్న ముస్లిం ఫ్రంట్ కార్యదర్శి పఠాన్ అష్రాఫ్ ఖాన్, అడ్వైజరీ కమిటీ సభ్యులు షేక్ షౌకత్ హుస్సేన్, షేక్ ఇబ్రహీం ప్రమాణ స్వీకారం చేశారు. జామియా మసీదు ఇమామ్ షేక్ అన్వరీ ట్రస్టీ, అడ్వైజరీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంజుమన్ ట్రస్టీగా పనిచేస్తున్న ముస్లిం ఫ్రంట్ కు చెందిన షేక్ అనీష్ అనారోగ్య కారణాల వల్ల ఈ ఎన్నిక అనివార్యమైంది. దీంతో పరిపాలనా సౌలభ్యం కోసం నూతనంగా తీసుకున్న ఇద్దరు అడ్వైజరీ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యువతరం అధ్యక్షులు ఎండి ఇక్బాల్ అహ్మద్, ముస్లిం ఫ్రంట్ గౌరవాధ్యక్షులు పఠాన్ ఆలీభాషా ఖాన్, ఫ్రంట్ అధ్యక్షులు షేక్ మహ్మద్ రఫీ, ముస్లిం పెద్దలు షేక్ సుభాని, ఎండి ఇబ్రహీం, షేక్ మహబూబ్ సుభాని, అంజుమన్ ట్రస్టీలు, ముస్లిం ఫ్రంట్ నాయకులు ముస్లిం యువతరం నాయకులు తదితరులు పాల్గొన్నారు.