suvichar
✕

జగన్ ఆస్తుల కేసులో మరో మలుపు

Written By శ్రీ
Updated: గురువారం, 31 అక్టోబరు 2019 (19:12 IST)
సీఎం జగన్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఐఏఎస్ సివిఎస్‌కె శర్మపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వం నుండి న్యాయ సహాయం పొంది కూడా నకిలీ బిల్లులు సృష్టించి లక్షల రూపాయలు పొందారంటూ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. 
 
బిల్లుల విడుదల విషయంలో శర్మకు మాజీ సీఎస్ పీకే మహంతి, మాజీ రెవెన్యూ కార్యదర్శి పివి రమేష్ సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఫిర్యాదుదారుడు రమణ. జగన్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురు ఐఏఎస్‌లకు అప్పటి ప్రభుత్వం న్యాయ సహాయానికి నిధులు విడుదల చేసింది. 
 
అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి సివిఎస్‌కె శర్మ ప్రభుత్వానికి న్యాయ సహాయ బిల్లులు అందజేయడంలో చేతివాటం ప్రదర్శించినట్లు, తప్పుడు బిల్లులతో లక్షల రూపాయల నిధులు విడుదల చేసినట్టు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రమణ.
 
శర్మ పెట్టిన బిల్లులను సరిగ్గా పరిశీలించకుండానే ఆనాటి సిసిఎస్ పీకే మహంతి సంతకాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు రమణ. దీనిపై అప్పటి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి టి వి రమేష్ నిధులు విడుదల చేశారని ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని కోర్టును పి.వి.రమణ ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు సైఫాబాద్ పోలీసులు.

అన్నీ చూడండి

Naga chaitnya : పురాతన కాలంలో రహస్యాలతో కొత్త ప్రపంచాన్ని చూపించనున్న వృషకర్మ

అనిరుధ్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో శింబు, నయనతార.. వీడియో వైరల్

Dimple Hayathi: గ్లామర్ సాంగ్స్, డాన్స్ చేశా; శర్వానంద్ కు మైలురాయి సినిమా భోగీ : డింపుల్ హయాతి

NTR Update: ఎన్టీఆర్.. డ్రాగన్ చిత్రం ఒకే భాగమా? రెండు భాగాలా? చర్చను రేకెత్తిస్తోంది

Mahesh Babu: ఎస్.ఎస్. కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు

తర్వాతి కథనం
Show comments