గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (12:26 IST)

ఏపీ సభాపర్వం : గవర్నర్ గో బ్యాక్.. టీడీపీ సభ్యుల నినాదాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ సమావేశంకాగా, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. అయితే, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు సభలో నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. 
 
అంతేకాకుండా, గవర్నర్ ప్రసంగానికి అడుగడుగా అడ్డుపడ్డారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చంపేసి గాల్లో ఎగురవేశారు. అలాగే, గవర్నర్ సభలో ప్రసంగింస్తుండగానే వారంతా సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించుకుని తిరిగి రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా, ఆయన్ను వెళ్లనీయకుండా తెదేపా సభ్యులు అడ్డుకున్నారు. దీంతో మార్షల్స్ రంగ ప్రవేశం చేసి తెదేపా సభ్యులను పక్కకు తోసేసి గవర్నర్‌కు దారి కల్పించారు. 
 
తొలి రోజు సభలో జరిగిన పరిణామాలపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడనివ్వలేదు. కానీ, లాబీల్లో కూడా ఉండనివ్వరా అంటూ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఎమ్మెల్సీలు బీటెక్ రవితో పాటు.. మరో ఎమ్మెల్సీని కూడా మార్షల్స్ బయటకు తోసుకెళ్లారు. దీంతో మార్షల్స్‌కు టీడీపీ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.