గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 20 మార్చి 2017 (13:36 IST)

ఏపీ అసెంబ్లీ లైవ్... 2019లోనూ నేనే సీఎం, మీకు అనుమానం అక్కర్లేదు: చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ... 2019లోనూ తనే ముఖ్యమంత్రి అవుతాననీ, ఆ విషయంలో మీకేమీ అనుమానం అక్కర్లేదంటూ సభలో విపక్ష సభ్యులనుద్దేశించి అన్నారు. ప్రజలంతా తమ పార్టీ తెదేపా పట్ల పూర్తి విశ్వాసంత

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ... 2019లోనూ తనే ముఖ్యమంత్రి అవుతాననీ, ఆ విషయంలో మీకేమీ అనుమానం అక్కర్లేదంటూ సభలో విపక్ష సభ్యులనుద్దేశించి అన్నారు. ప్రజలంతా తమ పార్టీ తెదేపా పట్ల పూర్తి విశ్వాసంతో వున్నారనీ, వారికోసం అహర్నిశలు పనిచేస్తున్నామని చెప్పారు.
 
పోలవరం ప్రాజెక్టును ప్రజలకోసం కట్టడం నా అదృష్టమని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ... ఎమ్మెల్యేలంటే బెంచీలెక్కి గోల చేయడం కాదన్నారు. వీళ్లంతా కొత్తగా అసెంబ్లీకి వచ్చారు అధ్యక్షా... వీళ్లకు నియమాలు తెలియవు అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెదేపా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
 
జూన్ 2వ తేదీ లోపల రాష్ట్రంలో ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ ఉండేట్లు చేస్తామని అన్నారు. అలాగే వృద్ధులకిచ్చే పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు, రైతులకు ప్రమాద బీమా తదితర ఎన్నో కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేస్తోందన్నారు. ప్రజల కోసం శ్రమిస్తున్న తమ పార్టీకే వచ్చే 2019 ఎన్నికల్లోనూ ప్రజలు పట్ట కడతారని జోస్యం చెప్పారు.