శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2017 (22:10 IST)

‘ర్యాలీ ఫర్ రివర్స్’ ప్రజల్లోకి తీసుకెళ్లాలి... సీఎం చంద్రబాబు పిలుపు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫెరెన్సులో మాట్లాడుతూ.... ‘‘2016-17 గ్రామీణ ఇళ్ల నిర్మాణంలో మరో 30వేల ఇళ్ల పనులు ప్రారంభం కావాల్సివుంది, వెంటనే ప్రారంభించాలి. 2017-18లో 30వేల ఇళ్లు, 2018-19కు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫెరెన్సులో మాట్లాడుతూ.... ‘‘2016-17 గ్రామీణ ఇళ్ల నిర్మాణంలో మరో 30వేల ఇళ్ల పనులు ప్రారంభం కావాల్సివుంది, వెంటనే ప్రారంభించాలి. 2017-18లో 30వేల ఇళ్లు, 2018-19కు 80వేల ఇళ్లకు శాంక్షన్స్ ఇవ్వాల్సివుంది, వెంటనే వాటిని మంజూరు చేయాలి. పేదల ఇళ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని అన్నారు.
 
కైలాష్ సత్యార్ధి పాదయాత్రలో అందరూ పాల్గొనాలి: 
మన రాష్ట్రంలో కైలాష్ సత్యార్ధి ‘‘సురక్షిత బాల్యం-సురక్షిత భారత్’’ పాదయాత్రలో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. స్వచ్ఛంద సంస్థల సందేశాత్మక యాత్రలు, ప్రజా చైతన్య కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రజలను చైతన్యపరిచేందుకు ముందుకొస్తున్న స్వచ్ఛంద సంస్థలను గౌరవించాలి, ప్రోత్సహించాలన్నారు. 
 
సద్గురు జగ్గీవాసుదేవ్ జరిపిన ‘ర్యాలీ ఫర్ రివర్స్’ వల్ల నదుల గొప్పదనం, వాటి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెరిగిందంటూ ఈ కార్యక్రమాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లివుంటే బాగుండేదన్నారు. సత్యార్ధి చేపట్టిన పాదయాత్రలో విద్యార్ధులు, మహిళలు, అన్నివర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు.