కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌తో పవన్ భేటీ.. ఎందుకు?
వన్యప్రాణులకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌తో సమావేశం కానున్నారు. వ్యవసాయ భూముల వద్దకు జంతువులు రావడం, పంటలను నాశనం చేయడం.. రైతుల జీవనోపాధికి హాని కలిగించడం వంటి సమస్యలకు పరిష్కార దిశగా ఈ చర్చలుంటాయని తెలుస్తోంది. వన్యప్రాణుల నుండి రైతుల పంటలను కాపాడే ఉద్దేశంతో ఈ సమావేశం జరుగుతుందని టాక్.
కుమ్కి ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశపెట్టడంతో పాటు వినూత్న పరిష్కారాలను అన్వేషించాలని పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఈ చొరవ పర్యావరణ సమతుల్యతను మెరుగుపరచడం, హానికరమైన వన్యప్రాణుల చర్యలను నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది.
రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించడం, మానవ-వన్యప్రాణుల సంఘర్షణ వల్ల ఎదురయ్యే బహుముఖ సవాళ్లను పరిష్కరించడంలో ఈ చర్చలు కీలకమైనవి. ఇందుకు కర్ణాటక మద్దతు అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.