గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (21:36 IST)

ఆనందయ్య కంటి చుక్కల మందుపై హైకోర్టులో విచారణ

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కంటి చుక్కల మందుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. తాను తయారుచేసిన కంటి చుక్కల మందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు హైకోర్టులో ఆనందయ్య రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిగింది. ఆనందయ్య చేసుకున్న దరఖాస్తును వెంటనే పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాంకేతిక కారణాలు చూపి దరఖాస్తు తిరస్కరించొద్దని స్పష్టం చేసింది. అయితే, తమకు దరఖాస్తు చేయలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
 
ఈ క్రమంలో దరఖాస్తు, ప్రభుత్వ జవాబును ఆనందయ్య తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ఆనందయ్య కంటి చుక్కల మందుతో ప్రమాదం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. 
 
దీనిపై స్పందించిన హైకోర్టు.. కరోనా వైరస్ వల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఎందరు మరణించారని నిలదీసింది. ఆనందయ్య మందు వల్ల ఎంతమంది మరణించారని ప్రశ్నించింది. ఆనందయ్య దరఖాస్తును పరిశీలించాలని స్పష్టం చేసింది.