శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 21 జనవరి 2019 (21:58 IST)

చంద్రబాబు దగ్గర నన్ను అలా చూపిస్తున్నారు - అఖిల ప్రియ ఆవేదన

చంద్రబాబు నాకు రాజకీయంగా దారి చూపించారు. కేబినెట్లో అవకాశం ఇప్పించారు. నా కుటుంబంపై ‌ఆయనకు ఉన్న ప్రేమ ఎనలేనిది. నన్ను సిఎం తన కుటుంబ సభ్యుల్లో ఒకరుగా చూసుకుంటారు. ఆయనంటే నాకు ఎనలేని గౌరవం. ఎందుకో కొంతమంది నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.
 
అధినేత దగ్గరే నన్ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నాపై ఎందుకో కొంతమంది కక్ష కట్టారు. కావాలనే నాపై, నా కుటుంబంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. నా గురించి ఎవరు ఏ విధంగా చెప్పినా బాబు నమ్మరు. నాకు ఆ నమ్మకం ఉంది. 
 
నేను పార్టీని వదిలిపోయే ప్రసక్తే లేదంటున్నారు భూమా అఖిలప్రియ. గత కొన్ని రోజులుగా తనపై జరుగుతున్న దుష్ర్పచారంపై బాధపడుతున్నానని చెప్పారు మంత్రి అఖిలప్రియ.