శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 15 జూన్ 2018 (19:01 IST)

రంజాన్ తోఫా... 5 కిలోల గోధుమలు, 2 కిలోల పంచదార... ఇంకా.. మంత్రి పుల్లారావు

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వమత ఐకమత్యానికి, ప్రపంచశాంతికి ఈ పండుగ ప్రతీక అని అభివర్ణించారు. రంజాన్ నెలలో ఉపవాసాలుండే ప్రజలు అల్లా కృపకు పాత్రులవుత

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వమత ఐకమత్యానికి, ప్రపంచశాంతికి ఈ పండుగ ప్రతీక అని అభివర్ణించారు. రంజాన్ నెలలో ఉపవాసాలుండే ప్రజలు అల్లా కృపకు పాత్రులవుతారు. ఈ నెల ప్రారంభంలోనే ముస్లీంలు పేద, నిస్సహాయులకు సేవలు, దానాలు చేయడం ప్రారంభించారని తెలిపారు. 
 
ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. అలాగే 12.5 లక్షల పేద ముస్లీంలకు 5 కేజీల గోధుమపిండి, 2 కేజీల పంచదార, కేజీ సేమియా, 100 గ్రాముల నెయ్యి రూ. 17ల విలువ కలిగిన క్యారీబ్యాగ్‌ను రంజాన్ తోఫా కింద ఉచితంగా పంపిణీ చేస్తున్నామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.