శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 10 మే 2017 (19:09 IST)

మంత్రి నారాయణ కుమారుడు మృతికి స్పీకర్ కోడెల సంతాపం

అమరావతి : పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ దుర్మరణానికి ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణకు ఇది తీరని లోటని పేర్కొన్నారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిషిత్‌తో పాటు రాజా రవివర్మ ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నారాయణ కుటుంబ సభ్యులకు స్పీకర్ కోడెల ప్రగాఢ సానుభూతి తెలిపారు.