బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 మే 2017 (11:01 IST)

ఫైనాన్స్ వ్యవహారం.. డబ్బు కోసం రమ్మని కడుపులో పొడిచేశాడు..

ఫైనాన్స్ వ్యవహారం హత్యకు దారి తీసింది. ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జెట్టి లింగయ్య అనే వ్యక్తి గుంటూరు జిల్లా కారంపొడిలోని లక్ష్మీగణపతి ఆటో ఫైనాన్స్ నుంచి అప్పు తీసుకున్నా

ఫైనాన్స్ వ్యవహారం హత్యకు దారి తీసింది. ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జెట్టి లింగయ్య అనే వ్యక్తి గుంటూరు జిల్లా కారంపొడిలోని లక్ష్మీగణపతి ఆటో ఫైనాన్స్ నుంచి అప్పు తీసుకున్నాడు. రుణం రికవరీ కోసం ఫైనాన్స్ గుమస్త అయిన శివ (26) తరచు ఫోన్ చేసి వాయిదా చెల్లించమని అడిగేవాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య  విబేధాలు పెరిగాయి.
 
వాయిదా డబ్బు చెల్లిస్తానని పట్టణంలోని గోకుల్‌బార్ దగ్గరికి రమ్మని శివను పిలిచాడు. శివ వచ్చిరాగానే లింగయ్య అతని కడుపులో మూడు సార్లు కత్తితో బలంగా పొడిచి పరారయ్యాడు. స్థానికులు హుటాహుటిన శివను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.