శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 19 జూన్ 2019 (19:54 IST)

వైసీపీకి ఓటేసి తప్పు చేశాం.. చెప్పుతో కొట్టుకోవాలి.. రెడ్లు ఏం చేసినా?

మామ ఇవ్వాల్సిన బెట్టింగ్ డబ్బుల కోసం అల్లుడి ఆస్పత్రిపై దాడి జరిగింది. నరసారావు పేటలో వైకాపా శ్రేణులు రెచ్చిపోయి.. దాడికి పాల్పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. పల్నాడు రోడ్డులోని శ్రీ కార్తిక్ ఆస్పత్రిపై దాడికి తెగబడ్డాయి. డాక్టర్ దంపతులపై దాడి చేయడమే కాకుండా ఆస్పత్రి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ పరిణామంతో రోగులు, వారి బంధువులు బయటకు పరుగులు తీశారు. 
 
దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయారు. ఈ నేపథ్యంలో డాక్టర్ రమ్య వైకాపాపై విమర్శలు గుప్పించారు. వైకాపా ఓటేసి తప్పు చేశామని.. మా చెప్పుతో మేం కొట్టుకుంటాం.. అన్నారు. ఎస్సీ కులం వారికి ఆసుపత్రి ఎందుకని అంటూ హేళన చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
రెడ్లు ఏం చేసినా అండగా ఉంటానని ఎమ్మెల్యే వైసీపీ శ్రేణులకు హమీ ఇచ్చారని.. అందుకే వైకాపా శ్రేణులు చెలరేగిపోతున్నారని డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి వెనుక వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి అండదండలతోనే తమపై, ఆస్పత్రిపై దాడులు జరిగాయని ఆరోపించారు.